Saturday, January 18, 2025
Homeసినిమాఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చిన పుష్ప 2

ఎట్టకేలకు సెట్స్ పైకి వచ్చిన పుష్ప 2

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ సినిమా సంచలనం సృష్టించడంతో ‘పుష్ప 2’ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఏర్పడిన అంచనాలకు తగ్గట్టుగా కథ ఉండాలని సుకుమార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఆమధ్య పుష్ప 2 పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది కానీ.. ఎప్పటి నుంచి సెట్స్ పైకి వెళుతుందో చెప్పలేదు. దీంతో బన్నీ అభిమానులే కాకుండా సినీ జనాలు కూడా పుష్ప 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూశారు.

ఆఖరికి ఈ నెల 10న పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. అతను మరియు అతని భార్య ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్ళడం జరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ప్రారంభమైంది. అల్లు అర్జున్ హైదరాబాద్ తిరిగి వచ్చాక సెట్స్‌లో జాయిన్ అవుతాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ బిగ్గీలో రష్మిక మందన్న కథానాయిక గా నటిస్తుంది. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ తదితరులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ సాంగ్స్ రికార్డ్ చేయడం జరిగింది. పుష్ప 1 లో సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో.. యూట్యూబ్ ని ఎంతలా షేక్ చేసాయో తెలిసిందే. అంతకు మించి అనేలా ఈ పుష్ప 2 కోసం సాంగ్స్ రెడీ చేశారట రాక్ స్టార్. అలాగే సాహిత్య చిచ్చర పిడుగు చంద్రబోస్ కూడా తన కలం బలం మరోసారి చూపించారట. దీంతో పుష్ప 2 కోసం ఎవరెన్ని అంచనాలతో వచ్చినా విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. మరి.. బన్నీ, సుక్కు కలిసి ఈసారి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్