Sunday, September 8, 2024
HomeసినిమాAllu Arjun Finger Nail: పుష్ప రాజ్ పింక్ గోరు వెనకున్న కథ ఏంటి..?

Allu Arjun Finger Nail: పుష్ప రాజ్ పింక్ గోరు వెనకున్న కథ ఏంటి..?

అల్లు అర్జున్, సుకుమార్.. కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడంతో పుష్ప 2 అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎప్పుడైతే పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ ను బన్నీ గెలుచుకున్నాడో అప్పటి నుంచి పుష్ప 2 పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

2024 ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ అని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ రెండు చేతులను మాత్రమే హైలెట్ చేశారు. రెండు చేతులకు ఉంగరాలు, బ్రెస్ లెట్ లు ఉన్నాయి. అయితే.. ఎడమ చేతికి పింక్ కలర్ గోరు పై పోకస్ పెట్టడం విశేషం. ఇప్పుడు ఈ గోరు గురించే చర్చ జరుగుతుంది. గతంలో విడుదలైన టీజర్ లోనూ ఈ పింక్ కలర్ గోరును హైలెట్ చేశారు. దీంతో దీని వెనుక ఏందో ఉందనే విషయం అర్థం అవుతుందని వార్తలు వస్తున్నాయి. సుకుమార్ తన ప్రతి సినిమాలో ప్రతిదీ చాలా డీటైల్ గా చెబుతుంటారు.

అందుచేత ఈ గోరు వెనుక కూడా పెద్ద కథ ఉంటుందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ సినిమా కథ పై సుకుమార్ అండ్ టీమ్ చాలా హామ్ వర్క్ చేశారు. అందుచేత ఖచ్చితంగా పుష్ప సినిమాకి మించిన సక్సెస్ ను పుష్ప 2 సాధిస్తుందని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. పింక్ కలర్ గోరు వెనుక ఏం ఉందో తెలియాలంటే.. నెక్ట్స ఇయర్ ఆగష్టు 15 వరకు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్