Saturday, January 18, 2025
Homeసినిమా'పుష్ప 2' రిలీజ్ ప్లాన్ మారిందా?

‘పుష్ప 2’ రిలీజ్ ప్లాన్ మారిందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘పుష్ప 2 ‘ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉండేలా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇటీవలే పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. డిసెంబర్ లో టీజర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే… ఈ మూవీని 2023 డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ మరింత ఆలస్యం కానుందని తెలిసింది. కథలో ప్రతి సన్నివేశానికి ఓ అర్థం ఉండేలా.. కథను చాలా పవర్ ఫుల్ గా రెడీ చేశారట. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైమ్ తీసుకోవాలి అనుకుంటున్నారట.

అందుచేత  రిలీజ్ 2023 డిసెంబర్ లో రావడం లేదట. 2024 మార్చిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రేక్షకులు ఎన్ని అంచనాలతో వచ్చినా.. ఖచ్చితంగా నచ్చేలా ఈ కథను రెడీ చేశారట సుకుమార్. అలాగే బడ్జెట్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో బన్నీ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తుంది. అలాగే బాలీవుడ్ యాక్టర్స్ కూడా నటింనున్నారని సమాచారం. స్పెషల్ సాంగ్… సమంతతో చేస్తారా.. ?  లేక బాలీవుడ్ హీరోయిన్ తో చేస్తారా..  అనేది తెలియాల్సివుంది. మొత్తానికి పుష్ప 2 ఎప్పుడు వచ్చినా… బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించేలా సుక్కు తెరకెక్కిస్తున్నారు. మరి.. బన్నీ, సుక్కు పుష్ప 2 మూవీతో చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.

Also Read పుష్ప 2 టార్గెట్ ఏమిటి? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్