Pushpa Biggest Grosser:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ హీరోయిన్ రష్మిక జంటగా నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 17న ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుక్కు కలిసి చేసిన సినిమా కావడం.. ఇద్దరికీ ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో పుష్ప ఏరేంజ్ సక్సస్ సాధిస్తుంది..? ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుంది..? అనేది ఆసక్తిగా మారింది.
అయితే.. ఈ సినిమా విడుదలకు ముందే నైజాంలో రికార్డు కలెక్షన్ వస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేయడం జరిగింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ రావడం ఖాయం అనే టాక్ వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప భారీ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. తొలి రోజు నైజాంలో ఆల్ టైం రికార్డు షేర్ 11.44 కోట్లు రాబట్టింది. ఇది ఆల్ టైం రికార్డు అని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. వరల్డ్ వైడ్ గా పుష్ప తొలి రోజు 71 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందని చిత్రయూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేసింది. ఇది 2021లోనే ఇండియాలో బిగ్గెస్ట్ గ్రాసర్ నిలిచింది. మరి.. ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.