Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా..?

పుష్ప రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‘. ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ, తమిళ, హిందీ భాషలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో అయితే… 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఇటీవల ‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా.. అంతకు మించి అనేలా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీకి బడ్జెట్ ఎంత అనే పరిమితి పెట్టుకోకుండా.. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇదిలా ఉంటే.. పుష్ప సినిమాని రీ రిలీజ్ చేస్తుండడం విశేషం. అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో పుష్ప సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ పుష్ప సినిమాను కేరళలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఒక డబ్బింగ్ సినిమాను ఈ స్థాయిలో రీ రిలీజ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. పుష్ప సినిమాను కేరళలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్ప మలయాళ వర్షన్ ను రీ రిలీజ్ కోసం సన్నాహాలు మొదలు అయ్యాయి.

కేరళలో అల్లు అర్జున్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ అల్లు అర్జున్ ను.. మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. పుష్ప రీ రిలీజ్ కి కారణం ఏంటంటే.. పుష్ప సినిమా విడుదల అయ్యి ఏడాది కాబోతున్న నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున మళ్లీ విడుదల చేసి పండుగ చేసుకోవాలి అనుకుంటున్నారు మల్లూ బన్నీ ఫ్యాన్స్. మరి.. రీ రిలీజ్ లో పుష్ప రికార్డ్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్