Saturday, June 13, 2026
Homeసినిమా'పుష్ప' రష్యన్ ట్రైలర్ విడుదల

‘పుష్ప’ రష్యన్ ట్రైలర్ విడుదల

Trailer: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందించాడు. ఈ చిత్రం రిలీజై దాదాపు సంవత్సరం కావొస్తున్నా పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటకి అలానే ఉంది. ప్రస్తుతం చిత్రం రష్యా లో డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందనే విషయం తెలిసిందే. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో మేకర్స్ ‘పుష్ప’ ట్రైలర్ ని రష్యన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. రష్యా భాషలోని ట్రైలర్ చూస్తుంటే.. మనకు భాష అర్ధంకాకపోయిన క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్ధమవుతుంది.

దీనికి కారణం పుష్ప చిత్రం మనపై చూపించిన ప్రభావమే. పుష్ప డబ్బింగ్ విషయంలో గట్టిగానే శ్రద్ధ తీసుకున్నారు. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోను బాగానే వర్కౌట్ అయ్యాయి. పుష్ప ది రైజ్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా వెళ్లనున్నారు. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్ లో మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. పుష్ప పార్ట్ 1కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తే, అది పార్ట్ 2కి ఉపయోగ పడుతుంది. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular