Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల క్రీడా పోటీలు

ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల క్రీడా పోటీలు

డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగ దినోత్సవాన్ని పురస్కరించు కొని రెండురోజులపాటు జరిగే ఆటల పోటీలను హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో  మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి  శ్రీనివాస గౌడ్  మాట్లాడుతూ దివ్యాంగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చూడడం కోసం ఈ క్రీడలను నిర్వహిచడం అభినందనీయమని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పెన్షన్లు మూడువేల రూపాయలకు పెంచిన ఘనత  కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సుమారు 110 రకాల ఆటలు ఆడేందుకు జిల్లాల నుండి వికలాంగులు హైదరాబాదు నగరానికి వచ్చారని వారందరికీ రెండు రోజులు ఆనందభరితంగా క్రీడలను నిర్వహిస్తామని దివ్యాగుల శాఖ డైరెక్టర్ శైలజ వివరించారు.

ఈ ఆటల పోటీలలో విజేతలు నిర్వహించిన వారికి మంత్రులు బహుమతులు, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్