Thursday, May 8, 2025
HomeTrending Newsస్విస్ ఓపెన్: సింధు విన్నర్, ప్రన్నోయ్ రన్నర్

స్విస్ ఓపెన్: సింధు విన్నర్, ప్రన్నోయ్ రన్నర్

Sindhu-Swiss: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పివి సింధు స్విస్ ఓపెన్ -2022 మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. నేడు జరిగిన ఫైనల్లో థాయ్ లాండ్ కి చెందిన బుసానన్ పై 21-16;12-8 తేడాతో విజయం సాధించింది.

ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన ఐదు బి డబ్ల్యూ ఎఫ్ టోర్నమెంట్లలో రెండు సింధు గెల్చుకుంది. తొలి టోర్నీ సన్ రైజ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన సింధు, ఢిల్లీ లో జరిగిన సయ్యద్ మోడీ టోర్నీలో మహిళల సింగిల్స్ గెల్చుకుంది. ఆ తర్వాత జర్మన్,  ఇంగ్లాండ్ టోర్నీల్లో క్వార్టర్స్ దశలోనే నిష్క్రమించింది.  స్విస్ ఓపెన్ లో తన ఆట తీరుకు పదును పెట్టి సత్తా చాటింది.

మరోవైపు పురుషుల సింగిల్స్  ఫైనల్లో మన దేశానికి చెందిన ప్రన్నోయ్ ఓటమి పాలై రన్నరప్ గా నిలిచారు. ఫైనల్లో ఇండోనేషియా ఆటగాడు జోనాతాన్ క్రిస్టీ చేతిలో 21-12; 21-18 తేడాతో ఓడిపోయాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్