మలేసియా ఓపెన్ లో రెండోరోజు భారత క్రీడాకారులు మిశ్రమ ఫలితాలు సాధించారు. ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించగా, పివి సింధు, మాళవిక బన్సోద్ ఓటమి పాలయ్యారు.
పురుషుల సింగిల్స్ లో మనదేశానికే చెందిన ప్రణయ్- లక్ష్య సేన్ ఇద్దరూ పోటీ పడగా 22-24; 21-12;21-18 తో ప్రణయ్ దే పైచేయి అయ్యింది.
పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జోడీ 21-16;21-13తో సౌత్ కొరియా ఆటగాళ్ళు సోల్ గ్యు- వాన్ హో పై గెలుపొందింది.
మహిళల సింగిల్స్ లో పివి సింధుపై స్పెయిన్ ప్లేయర్ కరోలినా మార్టిన్ 21-12; 10-21; 21-15తో విజయం సాధించగా, మరో మ్యాచ్ లో మాళవిక బన్సోద్ పై 21-9; 21-13తో సౌత్ కొరియా కు చెందిన అన్ సె యంగ్ గెలుపొంది రెండో రౌండ్లో అడుగు పెట్టింది.
మహిళల డబుల్స్ లో అశ్విని భట్- శిఖా గౌతమ్ ద్వయంపై థాయ్ లాండ్ కు చెందిన సుపిస్సర-సుపజిరకల్ జంట 21-10;21-12తో గెలుపొందారు.