Sunday, January 19, 2025
Homeసినిమారాధేశ్యామ్ ఫ‌స్ట్ ప్రీమియ‌ర్ షో ఎక్క‌డో తెలుసా?

రాధేశ్యామ్ ఫ‌స్ట్ ప్రీమియ‌ర్ షో ఎక్క‌డో తెలుసా?

Radhe Shyam Premier Show: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, క్రేజీ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా న‌టించిన భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు యువీ క్రియేష‌న్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా.. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా.. ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా రాధేశ్యామ్ చిత్రాన్ని ఈ నెల 11న భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు మేక‌ర్స్.
దీంతో ఇప్పటికే ఈ సినిమాకి రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ నమోదయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే ఉండడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ మూవీ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో రాధేశ్యామ్ ఫ‌స్ట్ ప్రీమియ‌ర్ షో ఎక్కడో  క్లారిటీ వ‌చ్చేసింది. కూక‌ట్ ప‌ల్లిలోని అర్జున్ థియేట‌ర్లో బినిఫిట్ షో ప్లాన్ చేశారు. ఇక్కడి నుంచే రాధేశ్యామ్ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నామ‌ని శ్రేయాస్ మీడియా సంస్థ తెలియ‌చేసింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్