Thursday, April 3, 2025
Homeసినిమాఆలిండియా రికార్డు సృష్టించిన ‘రాధే శ్యామ్’ ట్రైలర్

ఆలిండియా రికార్డు సృష్టించిన ‘రాధే శ్యామ్’ ట్రైలర్

Radhe Shyam Records: ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినమా పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

ఇటీవ‌ల‌ విడుదలైన రాధేశ్యామ్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఒక్క రోజులోనే ఈ మూవీ ట్రైలర్ 64 మిలియన్ వ్యూస్ అందుకుని ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 23న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అభిమానులే అతిథులుగా రాధే శ్యామ్ ట్రైలర్ విడుదల చేశారు. లవ్ స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్, డ్రామా, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ ట్రైలర్‌లో ఉన్నాయి. 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తుంది. ఈ భారీ పిరియాడిక్ ల‌వ్ స్టోరీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్నారు.

Also Read : విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకథ ‘రాధేశ్యామ్’

RELATED ARTICLES

Most Popular

న్యూస్