Sunday, February 23, 2025
Homeసినిమా'కాంచన 4'లో మొదలైన కదలిక!

‘కాంచన 4’లో మొదలైన కదలిక!

లారెన్స్ కి హీరోగానే కాదు .. దర్శకుడిగా కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఆయన దర్శకత్వంలో మొదలైన ‘కాంచన’ సిరీస్ పట్ల ఆడియన్స్ ఆసక్తిని కనబరుస్తూనే వస్తున్నారు. ‘కాంచన’ తరువాత వచ్చిన ‘కాంచన 2’ కూడా విశేషమైన ఆదరణను అందుకుంది. తాప్సీ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగును రాబడుతూ ఉంటుంది. లారెన్స్ ను ఆర్ధికంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిన సినిమా ఇది.

ఇక ఆ తరువాత వచ్చిన ‘కాంచన 3’ మాత్రం యావరేజ్ అనిపించుకుంది. ఈ సినిమాలో హారర్ కంటెంట్ కంటే, కామెడీకి ఎక్కువ చోటు ఇవ్వడం .. ఆ కామెడీలో విషయం తక్కువగా ఉండటం అందుకు కారణమైంది. అయినా ‘కాంచన 4’ కోసం అప్పటి నుంచి ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన, లారెన్స్ ఈ సినిమాపై అంతగా దృష్టి పెట్టలేదు. ఇన్నాళ్లకి మళ్లీ ముహూర్తం కుదిరింది. ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైంది.

ఎప్పటిలానే లారెన్స్ కథను సిద్ధం చేసుకున్నాడు. ఆయనే ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఆయనే కథానాయకుడిగా కనిపించనున్నాడు. ఇంతవరకూ వచ్చిన మూడు భాగాలకు భిన్నంగా ఈ కథ ఉంటుందని అంటున్నారు. ఇక కథానాయికగా ఈ సారి ఎవరిని తీసుకోనున్నాడనేది చూడాలి. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలు కానుందని తెలుస్తోంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. చూడాలి మరి ‘కాంచన 4’ ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేస్తుందో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్