Sunday, January 19, 2025
HomeTrending News10 ఎకరాల లోపు వారికే రైతుబంధు - మంత్రి నిరంజన్ రెడ్డి

10 ఎకరాల లోపు వారికే రైతుబంధు – మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రంలో 10 ఎకరాలలోపు ఉన్నవారికే రైతుబంధు వర్తిస్తుందని మంత్రి నిరంజన్​రెడ్డి ఈ రోజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతులే 92 శాతం ఉన్నారని ఆయన తెలిపారు. 1.50 కోట్లు మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని, రైతుల్లో 92 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని వెల్లడించారు. 2 రోజుల్లో 36.30 లక్షల రైతులకు రైతు బంధు నిధులు జమ అవుతాయని హామీనిచ్చారు. గత 8 విడతల్లో రూ.50,448 కో‌ట్లు రైతు బంధు నిధులు ఇచ్చామని తెలిపారు. 65 లక్షల మంది రైతులకు రూ.7508 కోట్లు అందనున్నాయన్నారు. 68 లక్షల మందిరైతులకు ఈ రైతుబంధు వస్తుందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్