బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమాను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశారు. తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ మూవీని పాన్ వరల్డ్ మూవీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తుండడం విశేషం. అయితే.. ఈ దర్శకధీరుడు డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఈ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టాడు.
అయితే.. ఇప్పుడు బాహుబలి టైమ్ లో మహాభారతం సినిమా స్టార్ట్ చేయడానికి ఇంకా ఓ పదేళ్లు టైమ్ కావాలి. ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ తనకు తాను పెట్టుకున్న పరీక్షలాంటివి. ఇంకా అనుభవం వచ్చిన తర్వాత తన కలల ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను అన్నారు. ఇప్పుడు బాహుబలి వచ్చి ఎనిమిదేళ్లు అవుతుంది. మరో రెండేళ్లల్లో మహాభారతం స్టార్ట్ అవుతుందని క్లారిటీ లేదు. ఇప్పుడు తన దృష్టి అంతా మహేష్ బాబుతో చేసే సినిమాల మీదే ఉంది. అయితే.. మహాభారతం సినిమాగా తీస్తే పది భాగాలుగా ఉంటుందని జక్కన్న చెప్పడం విశేషం.
ఇటీవల రాజమౌళి ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో మహాభారతం ప్రస్తావన వచ్చింది. ఆ కథను టీవీలో 260 పైగా ఎపిసోడ్లుగా తీశారు. మరి.. సినిమాగా తీస్తే ఎన్ని భాగాలు ఉంటాయని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మహాభారతం పై ఇండియాలో వచ్చిన అన్ని వెర్షెన్లు చదవడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయం పడుతుంది. కేవలం చదవడానికే అంత టైమ్ పడుతుంది. ఇక సినిమాగా తీస్తే పది భాగాలుగా తీయాల్సి వుంటుందని అన్నారు. ఇది ఓ నాలుగు భాగాలుగా ఉంటుంది అనుకుంటే.. ఇప్పుడు ఏకంగా పది భాగాలు అని చెప్పడంతో ఇది ఎంత పెద్ద ప్రాజెక్టో అర్థం అవుతుంది. మరి.. మహేష్ బాబు సినిమా తర్వాత ఈ సినిమానే స్టార్ట్ చేస్తాడో మరో సినిమా చేస్తాడో చూడాలి.