Saturday, January 18, 2025
HomeTrending Newsకాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు - రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు – రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో తనకు ఘోర అవమానం జరిగిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్ళను పక్కనపెట్టి, ద్రోహులకు పదవులివ్వడం ఆవేదనకు గురి చేసిందని తెలిపారు. బుధవారం సాయంత్రం హైద్రాబాద్ లోని తన నివాసంలో ముఖ్య అనుచరులతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ టీఆర్ఎస్ హవాలోనూ మునుగోడులో ఘన విజయం సాదించానని, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా….. ఎమ్మెల్సీగా గెలిపొందినా పార్టీలో గుర్తింపు దక్కలేదన్నారు.

12 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా హై కమాండ్ లో చలనం లేదని, తాను సీఎల్పీ పదవిలో ఉంటే ఎమ్మెల్యేలను కాపాడుకునే వాన్నని రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని ఇక భవిష్యత్ అంతా బీజేపీదే అని కార్యకర్తలకు వివరించారు. రానున్న సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేదన్నారు.

గెలిచినోళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదని, రేపటి నుంచి రాజీనామా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండని అనుచరవర్గానికి రాజగోపాల్ పిలుపు ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ తోనే నిర్ణయం తీసుకుందామన్నారు. మూడున్నరేళ్లుగా మునుగోడు అభివృద్ధి చేయలేక పోయామని, ఉపఎన్నిక వస్తేనైనా ప్రజలకు మేలు జరుగుతుందంటే రాజీనామా చేస్తానన్నారు. కేసిఆర్ తోనే తన పోరాటమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్