Sunday, January 19, 2025
Homeసినిమారాజమౌళి గారే నాకు స్ఫూర్తి: అడివి శేష్ 

రాజమౌళి గారే నాకు స్ఫూర్తి: అడివి శేష్ 

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా ఎదిగిన నటుడు అడివి శేష్. చిన్న చిన్న పాత్రలతో మెప్పిస్తూ ఇప్పుడు తనకంటూ ఒక జోనర్ ను సెట్ చేసుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా ‘హిట్ 2’ సినిమా రూపొందింది. నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా, డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్నరాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. రాజమౌళి ముఖ్య అతిథిగా ఈ ఈవెంట్ నడిచింది.

ఈ స్టేజ్ పై అడివి శేష్ మాట్లాడుతూ .. రాజమౌళి గారు అంటే నాకు చాలా ఇష్టం. ‘బాహుబలి’ సినిమా షూటింగు సమయంలో ఆయన పనితీరును చాలా దగ్గరగా గమనించాను. ఆ సినిమాలో రానా స్టాట్యూ ను నిలబెట్టే సీన్ విషయంలో ఆయన ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా చూశాను. ఎప్పటికప్పుడు నిత్య విద్యార్థిలా నేర్చుకుంటూ .. కష్టపడుతూ .. కసరత్తు చేస్తూ వెళ్లడం చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ఎంత ఎదిగినా మనవాళ్లను మరిచిపోకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాను.

నేను రాజమౌళిగారితో ఎక్కువగా మాట్లాడింది లేదు. ఆయనతో ఒక రానా మాదిరిగా .. నాని మాదిరిగా చనువుగా మాట్లాడాలని నాకూ ఉంటుంది. కానీ ఒక గురువుతో అలా మాట్లాడవచ్చా? అనే ఆలోచన రాగానే ఆగిపోతూ ఉంటాను. నిజం చెబుతున్నాను .. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. ఈ రోజున నేను కష్టపడి ఈ స్థాయికి రావడం వెనుక ఆయన ఇచ్చిన స్ఫూర్తి .. ప్రేరణ ఉన్నాయి. ఇకపై కూడా ప్రతి విషయంలోను నా ప్రయత్నం .. నా కష్టం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్