Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: మళ్ళీ ‘బెంగ’ ళూరు

ఐపీఎల్: మళ్ళీ ‘బెంగ’ ళూరు

RCB lost: ఐపీఎల్ ఈ సీజన్ మొదట్లో మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకున్నబెంగుళూరు మళ్ళీ గాడితప్పుతోంది. శనివారం హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 68 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు నేడు రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 145 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిల పడింది. రాజస్థాన్ 29 పరుగుల తేడాతో బెంగుళూరును ఓడించింది.

పూణేలోనే ఎంసిఏ స్టేడియంలో జరిగిన బెంగుళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  రాజస్థాన్ 33 పరుగులకే  3  వికెట్లు (బట్లర్-8; రవిచంద్రన్ అశ్విన్-17; పడిక్కల్-7) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత కెప్టెన్ సంజూ శామ్సన్ 21 బంతుల్లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ తో 27; డేరిల్ మిచెల్-16 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో రియాన్ పరాగ్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4సిక్సర్లతో 56 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డాడు. నిర్ణీత 20  ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. బెంగుళూరు బౌలర్లలో సిరాజ్, హసరంగ, హాజేల్ వుడ్ తలా రెండు; హర్షల్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో బెంగుళూరు 10 పరుగులకే తొలి వికెట్ (విరాట్ కోహ్లీ-9) కోల్పోయింది. ఈ మ్యాచ్ లో విరాట్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. జట్టు మొత్తంలో అత్యధిక స్కోరర్ కెప్టెన్ డూప్లెసిస్ చేసిన 23 కావడం విశేషం.  హసరంగ-18; షాబాజ్ అహ్మద్-17; రజత్ పటిదార్-16 పరుగులు చేయగలిగారు. 19.3 ఓవర్లలో 115 పరుగులకు బెంగుళూరు ఆలౌట్ అయ్యింది. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ నాలుగు, రవిచంద్రన్ అశ్విన్ మూడు, ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లతో సత్తా చాటారు.

56 పరుగులతో పాటు నాలుగు క్యాచ్ లు పట్టిన రియాన్ పరాగ్ కే ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది

Also Read ఐపీఎల్: చెన్నై పై పంజాబ్ విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్