Friday, June 12, 2026
Homeస్పోర్ట్స్ODI Series with SA: శిఖర్ కే సారధ్యం

ODI Series with SA: శిఖర్ కే సారధ్యం

వచ్చే వారం సౌతాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. శిఖర్ ధావన్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. రజత్ పటీదార్, ముఖేష్ కుమార్ లు తొలిసారి జాతీయ జట్టుకు ఆడనున్నారు.

మూడు టి 20లు, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు సౌతాఫ్రికా జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. గత బుధవారం తిరువనంతపురంలో జరిగిన మొదటి టి20లో ఇండియా 8 వికెట్లతో విజయం సాధించింది. నేడు గువహతి లో రెండో మ్యాచ్ జరుగుతోంది. మూడో మ్యాచ్ ఇండోర్ లో ఎల్లుండి నాలుగో తేదీన జరగనుంది. ఆ తర్వాత 6, 9,11 తేదీల్లో వరుసగా లక్నో, రాంచి, ఢిల్లీ ల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

 ఈ నెలలో ఆస్ట్రేలియా లో మొదలు కానున్న టి 20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ లాంటి వారికి వన్డే సిరీస్ కు విశ్రాంతి కల్పించారు.

జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్); శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్); రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, రజిత్ పతీదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శామ్సన్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కులదీప్ యాదవ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, ఆవేష్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

Also Read : BCCI: గంగూలీ, జై షా లకు లైన్ క్లియర్ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular