Wednesday, March 26, 2025
HomeTrending Newsబహిరంగ చర్చకు ఈటెల సవాల్

బహిరంగ చర్చకు ఈటెల సవాల్

హరీష్ రావ్ హుజూరాబాద్ లో అడ్డా పెట్టి అబద్దాల కారు కూతలు కూస్తున్నారని, డ్రామా కంపెనీలా మాట్లాడి సోషల్ మీడియాలో పెట్టి యాక్షన్ చేస్తున్నాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ దుయ్యబట్టారు. ప్రతి మాటలో వ్యంగ్యం, అబద్దం, ఇతరుల ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్దతి ఆపకపోతే నీ చరిత్ర ప్రజలకు చెప్పాల్సి ఉంటుందన్నారు. హుజూరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంత్రి హరీష్ రావు నిజ స్వరూపం  తొందరలోనే బయటపడుతుందన్నారు.

అభివృద్ది జరగలేదు, డబుల్ బెడ్ రూమ్ కట్టలేదు, కుంకుమ భరిణలు పంపించి ఓట్లు అడిగేస్తాయికి దిగజారినవు, నీ వెంట నాయకులు లేరు నా వెంటే ఉన్నారు అని ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటి మీద హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా లో బహిరంగ చర్చకు సిద్దమా అని హరీష్ రావుకు ఈటెల సవాల్ విసిరారు.

నేనే అన్నీ ఏర్పాట్లు చేస్తానన్న ఈటెల నువ్వు ఇంత తోపు, తురుం ఖాన్ వి కదా బహిరంగ చర్చకు సిద్దామా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్