Sunday, January 19, 2025
Homeసినిమాభారీ వసూళ్ల జాబితాలో చేరిపోయిన 'జైలర్'

భారీ వసూళ్ల జాబితాలో చేరిపోయిన ‘జైలర్’

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సౌత్ సినిమాల జోరు నడుస్తోంది. తెలుగు .. తమిళ సినిమాలు తమ జోరును కొనసాగిస్తూ ఉండగా, ఈ మధ్య కాలంలో కన్నడ .. మలయాళ సినిమాలు కూడా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. బడ్జెట్ తో పోల్చుకున్నా .. కంటెంట్ తో పోల్చుకున్నా ఒకదానికి మించి మరొకటి భారీ విజయాలను అందుకుంటున్నాయి. భాషా .. ప్రాంతం అనే భేదం లేకుండా కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.

తెలుగులో ‘బాహుబలి’ .. ‘బాహుబలి 2’ సినిమాలు ప్రపంచపటాన్ని ఆక్రమించుకున్నాయి. తెలుగు సినిమా వైభవం గురించి చెప్పుకునేటప్పుడు ఆ జాబితాలో ఈ సినిమా లేకుండా ఉండదు. అప్పటి నుంచి తెలుగులో పాన్ ఇండియా సినిమాల హవా పెరుగుతూ వెళ్లింది. ఆ తరువాత రాజమౌళి నుంచి వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ కూడా సంచలన విజయాన్ని సాధించింది. ఈ లోగా కన్నడ నుంచి వచ్చిన ‘కేజీఎఫ్ 2’ .. ‘కాంతార’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర లెక్కలను మార్చేశాయి.  కన్నడ సినిమాను మరింత ముందుకు తీసుకుని వెళ్లాయి.

ఇక రీసెంట్ గా తమిళం నుంచి వచ్చిన ‘జైలర్’ కూడా నిన్నటితో 500 కోట్ల క్లబ్ లో చేరిందని అంటున్నారు. సౌత్ నుంచి చాలా వేగంగా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా జాబితాలో ‘జైలర్’ కూడా చేరిపోయాడనే టాక్ వినిపిస్తోంది. ఈ వారం కూడా ఇక్కడ  ‘జైలర్’ వసూళ్లను ప్రభావితం చేసే సినిమాలేం లేవు. అందువలన ఈ సినిమా వసూళ్ల జోరు ఈ వారం కూడా కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలి మరి ‘జైలర్’ వసూళ్ల గ్రాఫ్ ఎక్కడ వరకూ వెళ్లి ఆగుతుందో!

RELATED ARTICLES

Most Popular

న్యూస్