‘రాజు గారి కోడిపులావ్’ కుటుంబ కథా వి చిత్రం అనేది శీర్షిక. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం నుంచి విడుదల పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకొన్నాయి.రాజు గారి కోడిపులావ్ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు ముస్తాబు అవుతోంది. వైవిధ్యభరితంగా, ఎంతో వినూత్నంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సోషల్ మీడియా నలుమూలల్లో ఎక్కడ చూసినా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ల హడావిడి జరుగుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. త్వరలోనే రాజు గారి కోడిపులావ్ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది.నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.