Saturday, June 29, 2024
Homeసినిమారామ్, బోయపాటి మూవీ సమ్మర్ లో రావడం లేదా..?

రామ్, బోయపాటి మూవీ సమ్మర్ లో రావడం లేదా..?

Release: రామ్ ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఆతర్వాత రెడ్ అనే సినిమా చేశాడు కానీ.. ఆడియన్స్ ని మెప్పించలేదు. ఇటీవల వారియర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు బోయపాటి శ్రీనుతో రామ్ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని చిట్టూరి శ్రీను నిర్మిస్తున్నాడు. రామ్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చాలా మాస్ గా.. చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నారు. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే.. ఈ మూవీ స్టార్ట్ అయ్యిందని వార్తలు వచ్చాయి కానీ.. ఆతర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. షూటింగ్ చకచకా జరుగుతుంది కానీ.. ఎంత షూట్ అవుతున్నా అంతకు అంతా వర్క్ వుంటూనే వుంది. బోయపాటి మేకింగ్ స్టయిల్ అంతే. ఈ సినిమా మే విడుదల అనుకున్నారు. తరువాత మరేం చెప్పలేదు. జూన్ లో విడుదల అవుతుంది అనుకుంటున్నారు కానీ జూన్ లో కూడా రావడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే జూలైలో ఇస్మార్ట్ శంకర్ రిలీజైంది. పెద్ద విజయం సాధించింది. ఆ..  సెంటిమెంట్ తో జులైలో విడుదల చేయాలి అనుకుంటున్నారట.

జులైలో విడుదల చేయడం కదురకపోతే ఆగస్ట్ లో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ‘భోళాశంకర్’ సినిమా ఆగష్ట్ టార్గెట్ గా రెడీ అవుతోంది కనుక రామ్-బోయపాటి సినిమాకు మిగిలింది జూలైనే. ఇప్పటి వరకు ఇంకా ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది తెలియలేదు. బోయపాటి దృష్టి అంతా మేకింగ్ మీదే వుంది. అందువల్ల ఇప్పటికి ఇంకా ఫ్యాన్స్ వెయిటింగ్ లో వుండాల్సిందే. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత బోయపాటి.. బాలయ్యతో సినిమా చేయాలి. అయితే అక్కడ బాలయ్య కూడా దసరా వరకు అనిల్ రావిపూడి సినిమా మీదనే వుంటారు. అందువల్ల ఇద్దరికీ తొందర లేదు. ఈ లెక్కన రామ్ మూవీ సమ్మర్ మిస్ అయినట్టే.

Also Read : రామ్ & బోయపాటి మూవీలో విలన్ గా ప్రిన్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్