Sunday, January 19, 2025
Homeసినిమారామ్, బోయపాటి మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

రామ్, బోయపాటి మూవీ ఇంట్రస్టింగ్ అప్ డేట్

రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. అఖండ తర్వాత బోయపాటి చేస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి సినిమా అంటే.. హీరో క్యారెక్టర్ ఓ రేంజ్ లో ఉంటుంది. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఉంటాయి. అందుచేత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి మూవీ పై పాజిటివ్ టాక్ ఏర్పడింది. రామ్ కు మాస్ లో మరింత క్రేజ్ వచ్చేలా.. పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా మార్కెట్ పెరిగేలా బోయపాటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యింది.. శరవేగంగా షూటింగ్ జరుపకుంటుంది కానీ.. ఇప్పటి వరకు ఈ సినిమా కథ ఏంటి..? అనేది బయటకు రాలేదు. దీంతో ఈ సినిమా స్టోరీ పై మరింత క్యూరియాసిటీ పెరిగింది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం భారీ ఫైట్ డిజైన్ చేశారట. భారీ అంటే నిజంగానే భారీ ఫైట్ అన్న మాట. ఒకప్పుడు ఓ ఇరవై మందితో ఫైట్ ఉంటే భారీ ఫైట్ అనేవారు. ఆతర్వాత మగధీర సినిమాతో ఆ లెక్క వంద మందికి చేరింది. ఇప్పుడు వంద కూడా దాటేసింది. భారీ యాక్షన్ సీన్స్ తెర పై చూపిస్తున్నారు.

బోయపాటి 1500 మందితో ఫైట్ డిజైన్ చేశారట. బోయపాటి సినిమాల్లో యాక్షన్ భీభత్సంగా వుంటుంది. రామ్ కి కూడా యాక్షన్ అంటే ఇష్టం. ఈ ఇద్దరూ ఇప్పుడు 1500 మందితో ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ ని ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ ఫైట్ చిత్రీకరణ ప్రారభించారు. పది రోజుల పాటు ఈ ఫైట్ ని షూట్ చేస్తారు. అఖండకి అదిరిపోయే యాక్షన్ అందించిన స్టంట్ శివ.. ఈ ఫైట్ కి యాక్షన్ కొరియోగ్రఫర్. ఈ ఫైట్ తెర పై మామూలుగా ఉండదని.. మాస్ ఆడియన్స్ కి అయితే.. పండగే అనేట్టుగా ఉంటుందని సమాచారం. దసరాకి ఈ భారీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. రామ్, బోయపాటి కలిసి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్