Tuesday, October 1, 2024
Homeసినిమారామ్, పూరి కాంబోలో మ‌రో మూవీ..?

రామ్, పూరి కాంబోలో మ‌రో మూవీ..?

Ismart Shankar 2: ఎన‌ర్జిటిక్ హీరో రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘ఇస్మార్ట్ శంక‌ర్’. ఈ సినిమాని ఎవ‌రూ మ‌ర‌చిపోలేరు. ఎందుకంటే.. రామ్ లో ఉన్న మాస్ ని బ‌య‌ట‌పెట్టిన చిత్ర‌మిది. అలాగే ఫ్లాపుల్లో ఉన్న పూరికి బ్లాక్ బ‌స్ట‌ర్ అందించి మ‌ళ్లీ ఫామ్ లోకి తీసుకువ‌చ్చిన సినిమా ఇది. మాస్ ఆడియ‌న్స్ కి బాగా నచ్చ‌డంతో ఈ సినిమాకి సీక్వెల్ తీయాలి అనుకున్నారు. పూరి ‘ఇస్మార్ట్ శంక‌ర్ 2’ ఉంటుంద‌ని ప్ర‌క‌టించ‌డం కూడా జ‌రిగింది.

అయితే.. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరి బిజీ అయ్యారు. ప్ర‌స్తుతం పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ మూవీ తీసారు. ఆగ‌ష్టు 25న ‘లైగ‌ర్’ మూవీ రిలీజ్ కానుంది. ఆత‌ర్వాత విజ‌య్ తో ‘జ‌న‌గ‌ణ‌మ‌న’ చిత్రం చేయ‌నున్నారు. అలాగే మ‌రో మూవీ కూడా విజ‌య్ తో పూరి ప్లాన్ చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. రామ్, పూరి క‌లిసి మ‌రో సినిమా చేయాలి అనుకుంటున్నార‌ని తాజాగా ప్ర‌క‌టించారు.

రామ్ ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ.. ఇస్మార్ట్‌ శంకర్‌ అంత పెద్ద విజయం అందుకొందంటే దానికి కారణం… పూరి సారే. ఆయనే అలాంటి కథ రాయగలరు. ఆయనే అలా తీయగలరు. ఈ సినిమా క్రెడిట్‌ మొత్తం పూరి సార్‌ నాకే కట్టబెట్టారు. అది ఆయన గొప్పదనం. నా వరకూ పూరి లేకపోతే ఆ సినిమా లేదు. మరోసారి ఆయనతో కలిసి పని చేయాలని ఉంది. అదెప్పుడు కుదురుతుందో అన్నారు. ఓ వైపు రామ్ బిజీ.. మ‌రో వైపు పూరి బిజీ. మ‌రి.. ఈ క్రేజీ కాంబినేష‌న్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.

Also Read : పోలీస్ ఆఫీసర్ గా రామ్ చెలరేగిపోతాడా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్