Saturday, January 18, 2025
Homeసినిమారామ్, బోయ‌పాటి మూవీలో బాల‌య్య‌?

రామ్, బోయ‌పాటి మూవీలో బాల‌య్య‌?

Guest Balayya: ఎన‌ర్జిటిక్ హీరో రామ్, ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇది రామ్, బోయ‌పాటి ఇద్ద‌రికీ.. ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డం విశేషం. దీంతో ఈ సినిమాని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని అంద‌రికీ న‌చ్చేలా బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రామ్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్ ఎవ‌రు అనేది ఇంకా ఫైన‌ల్ కాలేదు. బాలీవుడ్ హీరోయిన్స్ ను ఫైన‌ల్ చేయ‌నున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో బాల‌య్య క‌నిపిస్తార‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ సినిమాలో బాల‌య్య న‌టించ‌డం లేదు. కాక‌పోతే.. రామ్ బాల‌య్య అభిమానిగా క‌నిపిస్తార‌ట‌. బాలయ్య సినిమాలను చూసి ఇన్సిపైర్ అయ్యి విలన్స్ ను ఢీ కొట్టి నవ్వు పుట్టించడంతో పాటు నందమూరి అభిమానులను ఆకట్టుకునే విధంగా రామ్ పాత్ర ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు ద్వారా తెలుస్తోంది.

రామ్ ను బాలయ్య అభిమానిగా చూపిచడం ద్వారా బోయపాటి సినిమా  అప్పుడే సగం సక్సెస్ అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. బోయపాటి గత చిత్రం అఖండ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా కూడా ఆ సినిమా స్థాయిలో ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. మ‌రి.. రామ్ కు ఈ భారీ పాన్ ఇండియా మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Also Read :  రామ్ ‘ది వారియర్’లో రెండో పాట ‘దడ దడ’ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్