Thursday, January 23, 2025
Homeసినిమాచరణ్‌, అర్జున్ మూవీ డైరెక్టర్ ఫిక్స్..?

చరణ్‌, అర్జున్ మూవీ డైరెక్టర్ ఫిక్స్..?

చరణ్‌, అల్లు అర్జున్.. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ వస్తే చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సినిమా ప్రచారంలో ఉంది. ఆతర్వాత ఎందుకనే ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి వార్తలు వినిపించలేదు. అయితే.. ఇటీవల అలీతో సరదాగా టాక్ షో లో అల్లు అరవింద్ మళ్లీ చరణ్ అర్జున్ లతో సినిమాను గురించి మాట్లాడడం జరిగింది. అప్పటి నుంచి మళ్లీ ఆ సినిమా వార్తల్లో నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా చరణ్‌, అర్జున్ అనే టైటిల్ ను రెన్యువల్ చేయిస్తూనే ఉన్నాను అంటూ అల్లు అరవింద్ ప్రకటించడంతో ఖచ్చితంగా ఈ సినిమా ఉంటుందని సినీ అభిమానులు అందరిలో నమ్మకం ఏర్పడింది.

అయితే… ఇప్పటి వరకు ఈ క్రేజీ మూవీ గురించి టైటిల్ మాత్రమే ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా దర్శకుడు గురించి కూడా ప్రచారం మొదలయ్యింది. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే… ఈ క్రేజీ, భారీ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అల్లు అరవింద్ స్వయంగా ఈ విషయంలో త్రివిక్రమ్ ను రిక్వెస్ట్ చేశాడని అంటున్నారు. త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించాడు. కనుక వీరిద్దరి కాంబోలో తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకునే మూవీ మళ్లీ వస్తుంది అంటున్నారు.

అల్లు అరవింద్ రాబోయే రెండేళ్లలో సినిమాను పట్టాలెక్కించాలి అనుకుంటున్నారట. చరణ్‌, అర్జున్, త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ.. 2025 లోపే చరణ్, అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే బాగుండు అన్నట్లుగా ప్రతి ఒక్క మెగా అభిమానితో పాటు సినీ అభిమాని కూడా కోరుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. ఇది నిజంగా నిజమైతే.. చరణ్‌, అర్జున్ మూవీని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తే.. పెద్ద సంచలనమే.

Also Read : అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్