Sunday, January 19, 2025
Homeసినిమాచరణ్‌, లోకేష్ కనకరాజ్ కాంబో ఫిక్స్ అయ్యిందా..?

చరణ్‌, లోకేష్ కనకరాజ్ కాంబో ఫిక్స్ అయ్యిందా..?

రామ్ చరణ్‌ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ అయ్యారు. దీంతో చరణ్‌ నెక్ట్స్ మూవీ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం చరణ్.. శంకర్ తో భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో కైరా అద్వానీ కథానాయిక కాగా, శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత చరణ్‌.. బుచ్చిబాబుతో సినిమా చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఈ చిత్రాన్ని వృద్ది సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే.. శంకర్ తో మూవీ, బుచ్చిబాబుతో మూవీ కాకుండా.. కన్నడ డైరెక్టర్ నర్తన్ తో కూడా చరణ్ మూవీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. కోలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న లోకేష్ కనగరాజ్ తో చరణ్‌ మూవీ చేస్తున్నాడట.

ఈ క్రేజీ కాంబోలో మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. ఎప్పటి నుంచో యువీ క్రియేషన్స్ చరణ్ తో మూవీ చేయాలి అనుకుంటుంది. అది ఇప్పటికి సెట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. అయితే.. లోకేష్ కనకరాజ్ లైన్ అప్ చూసుకుంటే మరో మూడేళ్ళు వరకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. కోలీవుడ్ స్టార్ విజయ్ తో చేస్తున్న లియో మూవీ ఈ ఏడాది ఆఖరులో రిలీజ్  కానుంది. తర్వాత ఖైదీ సీక్వెల్ ఉంటుంది. దీని తర్వాత విక్రమ్ సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉంది. వీటి తర్వాత చరణ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ ఉంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్