Sunday, January 19, 2025
Homeసినిమాజక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన చరణ్‌

జక్కన్నను ఆకాశానికి ఎత్తేసిన చరణ్‌

తెలుగు సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సంచలన చిత్రం ‘ఆర్ఆర్ఆర్‘. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా నటించారు. 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ మేకర్స్ ని విశేషంగా ఆకట్టుకుని,  గోల్డన్ గ్లోబ్ అవార్డ్ కూడా దక్కించుకుంది.  ఆస్కార్ బరిలో నిలవడంతో జక్కన్న పై హాలీవుడ్ మేకర్స్ ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే… త్వరలో ఆస్కార్ అవార్డుల వేడుక జరగనున్న నేపథ్యంలో ఆస్కార్ కమిటీ ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఆహ్వానాలు పంపించింది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం అక్కడ చరణ్ సందడి చేస్తున్నారు. మోస్ట్ పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూలో చరణ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. ముగ్గురు యాంకర్లు చరణ్ ని ఇంటర్వ్యూ చేస్తూ పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. చరణ్ కూడా అంతే ఆసక్తిగా సమాధానాలు చెప్పడం విశేషం.

ఆర్ఆర్ఆర్ ఈ స్థాయిలో వైరల్ కావడానికి గల కారణం ఏంటని అడిగితే … “గ్రేట్ ఫ్రెండ్షిప్… బ్రదర్ హుడ్ రెండు పాత్రల మధ్య వున్న అనుబంధం.. మా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ ఇది” అన్నారు. ఇదే సందర్భంగా దర్శకుడు రాజమౌళి గురించి మాట్లాడుతూ.. తను ఇండియన్ సినిమాకు స్పీల్ బర్గ్ అని అభివర్ణించాడు. అంతే కాకుండా రాజమౌళి చేస్తున్న నెక్స్ట్ మూవీ గ్లోబల్ సినిమా అని క్లారిటీ ఇచ్చేశాడు. తొలిసారి భారతీయ సినిమాకు ఆస్కార్ గుర్తింపు లభించిందని తెలిపాడు. ఇది ఇండియన్ సినిమాకు జస్ట్ ద బిగినింగ్ అని చెప్పడం విశేషం. ఈ విధంగా రాజమౌళిని రామ్ చరణ్ ఆకాశానికి ఎత్తేశాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్