Saturday, March 29, 2025
Homeసినిమాఆస్కార్స్ యాక్టర్స్ బ్రాంచ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌..

ఆస్కార్స్ యాక్టర్స్ బ్రాంచ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌..

రామ్‌చరణ్‌ తాజాగా ఆయన ఓ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో సభ్యత్వం పొందారు.’ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో సీతారామరాజు పాత్రలో అద్భుతాభినయాన్ని ప్రదర్శించినందుకుగాను ఆయనకు స్థానం దక్కింది. ఆస్కార్‌ అవార్డుల కమిటీ ఇటీవల యాక్టర్స్‌ బ్రాంచ్‌లో కొత్త సభ్యులను చేర్చుకుంది. ప్రపంచ సినిమాలో ప్రముఖ నటీనటులు చోటు దక్కించుకున్నారు.

తాజాగా ఇందులో రామ్‌ చరణ్‌ జాయిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్కార్‌ కమిటీ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా పంచుకుంది. రామ్‌చరణ్‌తో పాటు కొంతమంది హాలీవుడ్‌ నటులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో ఎన్టీఆర్‌ కూడా స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగు నుంచి ఇద్దరు అగ్ర హీరోలు ఈ యాక్టర్స్‌ బ్రాంచ్‌లో స్థానం పొందడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: చరణ్‌ నమ్మకం నిజమయ్యేనా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్