Sunday, September 8, 2024
Homeసినిమావిజయ్ మూవీలో చరణ్‌.. ఇది నిజమా?

విజయ్ మూవీలో చరణ్‌.. ఇది నిజమా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇటీవల ‘వారసుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాడు. ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. తమిళ్ లో మాత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో విజయ్.. వంశీ పైడిపల్లితో మరో మూవీ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. తెలుగులో స్టార్ హీరోలందరూ వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండడంతో వంశీ పైడిపల్లి మళ్లీ విజయ్ తోనే సినిమా చేయడం కోసం స్టోరీ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో విజయ్, వంశీ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం విజయ్… లోకేష్ కనగరాజ్ తో ‘లియో’ చేస్తున్నాడు. యూనివర్స్ కాన్సెప్ట్స్  తో ఈ మూవీ ఉండబోతుందని సమాచారం.  దీనిలో విజయ్ గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.  ఈ సినిమా కోసం కోలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ రంగంలోకి దించుతున్నాడు. ప్రతినాయకుడుగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తుండడం విశేషం.

విజయ్ కి జంటగా త్రిష, ప్రియా ఆనంద్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం దానికి తోడు లోకేష్ యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో ‘లియో’పై భారీ అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమాకి  సంబంధించి మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఏంటంటే… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఓ ప్రత్యేక రోల్ కోసం లోకేష్ కనగరాజ్ ఫైనల్ చేశారట. కోలీవుడ్ లో ఈ న్యూస్ ఎక్కువగా చక్కర్లు కొట్టింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. ప్రస్తుతం చరణ్‌.. శంకర్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. ఆతర్వాత బుచ్చిబాబుతో మూవీ చేయనున్నారు. అందుచేత ఇలాంటి టైమ్ లో వేరే సినిమాల్లో నటించే పరిస్థితిలో లేడని.. ప్రచారంలో ఉన్న వార్తలో నిజం లేదని తెలిసింది.

Also Read : ‘దళపతి 67’ లో త్రిష కృష్ణన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్