Saturday, January 18, 2025
Homeసినిమాజయమ్మ పంచాయితీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాం చరణ్

జయమ్మ పంచాయితీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాం చరణ్

RAM Charan Released First Look Of Sumas Jayamma Panchatathi :

పాపులర్ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం వెండితెర పై కనిపించబోతున్నారు. విలేజ్ డ్రామాగా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. జయమ్మ పంచాయితీ అంటూ రాబోతోన్న ఈ సినిమాలో సుమ కనకాల ఎంతో ఇంటెన్సిటితో కనిపిస్తున్నారు. పాత కాలంలో మాదిరి రోలు, రోకలి పట్టుకుని సుమ కనిపిస్తున్నారు. సుమ ఎంతో కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమ రోకలి దెబ్బకు పగళ్లు రావ‌డం కూడా ఈ పోస్ట‌ర్‌లో చూడొచ్చు.

ఇక ఆమె కొంగును చూస్తే.. గ్రామీణ వాతావరణానికి సంబంధించిన అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సుమ ఊరి పెద్దలా నటిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఫస్ట్ లుక్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2 గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ తుది ద‌శ‌లో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు నిర్మాత‌లు.

ఇవి కూడా చదవండి: 

రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చిత్రం

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్