ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ గ్లోబల్ స్టార్ అవ్వడం తెలిసిందే. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది చరణ్ 15వ చిత్రం కాగా దిల్ రాజు 50వ చిత్రం కావడం విశేషం. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తెలుగులో చేస్తున్న ఫస్ట్ స్ట్రైయిట్ మూవీ కావడంతో అసలు కథ ఏంటి..? ఈ మూవీ ఎలా ఉండబోతుంది..? అని మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అయితే.. ఈ కథ విన్నప్పుడు చరణ్ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ప్రతి ఒక్కరినీ ఆలోచింప చేసే కథ అట. అందుకనే ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాడని సమాచారం. ఎప్పుడో పూర్తి కావాల్సిన సినిమా ఇది. ఇండియన్ 2 వలన ఆలస్యం అవుతోంది. అయినప్పటికీ.. ఈ కథ పైన, శంకర్ పైన చరణ్ కు గట్టి నమ్మకం ఉందట. గేమ్ ఛేంజర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అని సన్నిహితుల దగ్గర చెప్పాడట. ఈ నెలలో కొన్ని సీన్స్ చిత్రీకరించిన తర్వాత నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్ లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.
నవంబర్ షెడ్యూల్ లో కూడా చరణ్ పై కీలక సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీకాంత్, సునీల్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించడం విశేషం. ఈ సినిమా షూటింగ్ సాగుతూనే ఉంది. రిలీజ్ డేట్ పై శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో… ఈ మూవీ సక్సెస్ విషయంలో చరణ్ నమ్మకం ఎంత వరకు నిజం కానుందో చూడాలి.