Sunday, January 19, 2025
Homeసినిమాచిరంజీవి కు రామ్ గోపాల్ వర్మ సలహా. మరి పాటిస్తారా..?

చిరంజీవి కు రామ్ గోపాల్ వర్మ సలహా. మరి పాటిస్తారా..?

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన మాటలతో.. ట్వీట్ లతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంటారు. ప్రస్తుతం ‘వ్యూహం’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ రాజకీయ చిత్రంతో ఇటీవల వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న వర్మ ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యారు. తనదైన స్టైయిల్ లో ట్వీట్స్ పెడుతున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన రీమేక్ మూవీ భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేష్ డైరెక్టర్. ఈ సినిమా ఆగష్టు 11న థియేటర్లో రిలీజైంది.

ఈ సందర్భంగా వర్మ పెట్టిన ట్వీట్ ఆసక్తిగా మారింది. ఇంతకీ వర్మ ఏమని ట్వీటారంటే.. జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి, రియాల్టీకి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది. పొగడ్తలతో ముంచే బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు. రియాలటీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే అంటూ వర్మ ట్వీటారు. ఇందులో ఆయన చిరంజీవి పేరు, భోళాశంకర్ పేరు ప్రస్తావించలేదు. కానీ ఆ సినిమానే టార్గెట్ చేస్తూ, పరోక్షంగా పోస్టులు పెట్టారనే విషయం ఎవరికైనా ఈజీగా అర్థమౌతుంది.

భోళాశంకర్ మూవీ రీమేక్ మూవీ కావడం.. దీనికి ఫ్లాపు చిత్రాల దర్శకుడు మెహర్ రమేష్ డైరెక్టర్ కావడం… వలన ఫస్ట్ నుంచి బజ్ లేదు. మేకర్స్ ఎంత ప్రయత్నం చేసినా క్రేజ్ రాలేదు. రిలీజ్ తర్వాత ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో అనుకుంటే అదీ జరగలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకునే రామ్ గోపాల్ వర్మ ఇలా ట్వీట్ చేశారని కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా రీమేక్ లను నమ్ముకున్న మెగాస్టార్ భారీ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. ప్రజెంట్ రీమేక్ సినిమాలను చూసే మూడ్ లో జనాలు లేరు. కంటెంట్ బాగుంటేనే చూస్తున్నారు. మరి.. వర్మ సలహాను చిరు పాటిస్తారా..?

RELATED ARTICLES

Most Popular

న్యూస్