Sunday, January 19, 2025
Homeసినిమా‘జాతీయ రహదారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ

‘జాతీయ రహదారి’ ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ

విభిన్నకథా చిత్రాల దర్శకుడు నరసింహ నంది తెరకెక్కించిన తాజా చిత్రం ‘జాతీయ రహదారి’. ఇందులో మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ నందిరెడ్డి, ధక్షిత్ రెడ్ది, అభి, తెల్జెరు మల్లెష్, తరని, గోవిందరాజు, ఘర్షణ శ్రీనివాస్, విజయ భాస్కర్, సిద్దిపేట రవి తదితరులు నటించారు. తుమ్మల రామ సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా రెడీ అవుతుంది. ‘జాతీయ రహదారి’ మూవీ ట్రైలర్ ను సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… ‘జాతీయ రహదారి’ ట్రైలర్ ను చూశాను. చాలా హర్ట్ టచింగ్ గా ఉంది. కరోనా టైమ్ లో జరిగిన 2 ప్రేమకధలకి ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చాడు. ఈ చిత్రానికి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. నరసింహనందికి, అలాగే ఇంత రిస్క్ తీసుకుని మంచి సినిమా తీయాలి అనుకునే మా ప్రొడ్యూసర్ రామ సత్య నారాయణ గారికి నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి మాట్లాడుతూ “ఆర్.జి.వి గారి దయవల్లే నేను ఈ రోజు ఇలా వైట్ బట్టలు వేసుకుని  ఈ స్థానంలో ఉన్నాను. ఆయనకి నచ్చనిదే ఏ పని చేయరు. అలాంటిది ఈ మూవీ ట్రైలర్ చూసి బావుంది అని చెప్పారు. డైరెక్టర్ ని ఒకసారి పిలువు అన్నారు. ఈ మూవీ డైరెక్టర్ నరసింహ నందికి శుభాకాంక్షలు తెలిపిన మా గురువు గారు వర్మ గారికి రుణపడి ఉంటాను. ఈ నెల 10 వ తేదీన వినాయక చవితి కానుకగా రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం” అన్నారు.

డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ… “నేను ఎప్పుడు ఆర్.జి.వి. గారిని కలుస్తానా అని అనుకునే వాడిని. అది ఈ జాతీయ రహదారి వల్ల తీరింది, ఆయన శివ సినిమా చూసి చెన్నై కి ట్రైన్ ఎక్కిన వాళ్లలో నేను ఒకడిని. వర్మ గారు ఎప్పుడూ ఎవరినీ మెచ్చుకోరు. అలాంటిది మా ట్రైలర్ చూసి మా జాతీయ రహదారి ట్రైలర్  బావుంది అని మెచ్చుకున్నందుకు రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్” అని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్