Friday, February 21, 2025
Homeసినిమా'వ్యూహం' రెండో టీజర్ విడుదల

‘వ్యూహం’ రెండో టీజర్ విడుదల

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం తర్వాత చోటు చేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘వ్యూహం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టీజర్, పోస్టర్స్ విడుదల చేశారు. ఇవాళ రెండో టీజర్ విడుదల చేశారు.

కుట్రలకు, ఆలోచనలకు మధ్యలో అసమాన్యుడిగా ఎదిగిన నాయకుని కథే ‘వ్యూహం’ అని,  ఆ నాయకుడే వైయస్‌ జగన్‌ అని ఇప్పటికే వర్మ తెలిపారు. రెండో టీజర్‌లో నాయకునిగా జగన్ ఎదిగిన క్రమాన్ని చూపించారు. ‘నిజం తన షూ లెస్ కట్టుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుంది’ అని జగన్ ఆవేదన చెందిన సందర్భాన్ని చూపించారు.

‘వ్యూహం’ చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తి అయ్యిందని, అతి త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు.‘వ్యూహం’లో మానస నటిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్