Saturday, January 18, 2025
Homeసినిమాఇంత కంటే మించిన అవార్డ్ వుండదు. - రామ్

ఇంత కంటే మించిన అవార్డ్ వుండదు. – రామ్

రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’. ఇందులో రామ్ కు జంటగా శ్రీలీల నటించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ వేడుకలో రామ్ పోతినేని మాట్లాడుతూ.. స్కంద ప్రీరిలీజ్ ఈవెంట్  కి విచ్చేసిన బాలకృష్ణ గారికి థాంక్స్. ఆయన రాకతోనే ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా మెమరబుల్ గా జరిగింది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. త్వరలో ఒక పాట వస్తుంది అది మాములుగా వుండదు. అది వింటే ఈ సినిమా మీటర్ ఏమిటో బాగా అర్ధమౌతుంది. నిర్మాత శ్రీనివాస్ గారు లేకపోతే ఈ సినిమా వుండదు. ఐదేళ్ళ క్రితమే బోయపాటి, మీరు కాంబినేషన్ అయితే అడిపోతుందని చెప్పారు. అది ఈవాళ కుదిరింది.  పవన్ గారికి థాంక్స్. సాయిమంజ్రేకర్ చక్కగా నటించారు. సినిమాకి డేట్స్ ఇస్తే హీరోయిన్ అంటారు. ఒక్క డేట్ సినిమాకి ఇస్తే అది శ్రీలీల అంటారు ( నవ్వుతూ) .తనకి గ్రేట్ ఫ్యూచర్ వుంది.

బోయపాటి గారు మొండిగా నమ్మి వెళ్ళిపోతారు. ట్రైలర్ లో చూసిన లుక్ కి ఏడు గంటలు పట్టేది. పక్కనే కూర్చుని ఓపికగా చేయించారు. బాలయ్య గురించి ఒక మాట చెప్పాలి. మాస్ , క్లాస్ , ఫ్యామిలీ, అమ్మాయిలు ..  ఇలా అన్నీ సెక్షన్స్ జై బాలయ్య మంత్రం జపిస్తుంది. బాలయ్య గారి గురించి జైలర్ సినిమాలో పాట పాడుతా. నీ రచ్చ చుసినోడు, నీ అయ్యా విజల్ విన్నవాడు, రేపు నీ కొడుకు మనవడితో డ్యాన్స్ చేయించేవాడు… మూడు జనరేషన్స్ జై బాలయ్య అంటుందంటే.. ఒక నటుడికి అది పెద్ద అచీవ్ మెంట్. ఇంతకంటే మించిన అవార్డ్ వుండదు. నా ఫ్యాన్స్ కి ఒక మాట చెప్పాలి. పులి వేటకి వచ్చింది. షూట్ చేసినప్పుడు అందరికి కెమరా కనిపిస్తుందోమో. నాకు మాత్రం మీరే కనిపిస్తారు. అందుకే వొళ్ళు దగ్గరపెట్టుకొని పని చేస్తా. నా లక్కు మీరే నా కిక్కు మీరే. అందరికీ థాంక్స్. జై బాలయ్య’’  అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్