Sunday, September 8, 2024
Homeసినిమా'స్కంద' నుండి నీ 'చుట్టూ చుట్టూ' సాంగ్ రిలీజ్!

‘స్కంద’ నుండి నీ ‘చుట్టూ చుట్టూ’ సాంగ్ రిలీజ్!

బోయపాటి శ్రీను, రామ్ కాంబోలో వస్తున్న ‘స్కంద’ ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ కు సరైన హిట్ పడలేదు. మధ్యలో ‘వారియర్’ అంటూ వచ్చినా అది అంతగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ‘స్కంద’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్. ఇప్పుడు ఈ మూవీ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నీ చుట్టూ చుట్టూ’ అని సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన రామ్, శ్రీలీల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రామ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ సాంగ్ వచ్చేసింది. నేడు ఆగస్టు 3 ఉదయం 9:36 నిమిషాలకు ‘నీ చుట్టూ చుట్టూ’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ పాట ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఫుల్ సాంగ్ రిలీజ్ అవ్వడంతో రామ్ అభిమానులు మంచి కిక్ ఇచ్చినట్టయ్యింది. ఇక సాంగ్ విషయానికొస్తే.. ప్రోమోలో చూసినట్టే రామ్, శ్రీలీల డాన్స్ అదరగొట్టారు. ‘నీ చుట్టూ చుట్టూ’ అంటూ రామ్, శ్రీలీల వేసే స్టెప్స్ కూడా అదిరిపోయాయి. నిజంగా అలాగే ఫుల్ ఎనర్జీతో రామ్, శ్రీలీల డాన్స్ చేసి ఆకట్టుకున్నారు.

ఇక తమన్ అందించిన సంగీతం కూడా బానే ఉంది. ఈ పాటకు రఘురామ్‌ సాహిత్యం అందించగా.. సిద్‌ శ్రీరామ్‌, సంజన కల్‌మంజీ ఆలపించారు. ఇప్పుడీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.ఇక ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌‌పై శ్రీనివాస చిట్టూరి మూవీను నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా స్కంద సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్