Sunday, January 19, 2025
Homeసినిమాబోయపాటి రామ్ ల 'స్కంద' ట్రైలర్ డేట్ ఖరారు...!

బోయపాటి రామ్ ల ‘స్కంద’ ట్రైలర్ డేట్ ఖరారు…!

బోయపాటి శ్రీను, రామ్ పోతినేని పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’- ది ఎటాకర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ‘స్కంద’ విడుదల కానుంది.

దీనిపై గట్టి హైప్ ఇప్పుడు నెలకొంది. ఇప్పటికే వచ్చిన టీజర్ మరియు పాటలు మాస్ ఆడియెన్స్ ని అలరించగా సినిమా రిలీస్ పై కూడా కూడా మంచి హైప్ ఇప్పుడు క్రియేట్ అయ్యింది. అయితే ఫైనల్ గా ఈ హైప్ ని మరింత చేసే విధంగా సినిమా నుంచి ట్రైలర్ బ్లాస్ట్ కి ఇపుడు మేకర్స్ డేట్ ని లాక్ చేసేసారు.

ఈ సినిమా ట్రైలర్ ని ప్రీ రిలీజ్ థండర్ అంటూ అనౌన్స్ చేయగా దీనిని ఈ ఆగస్ట్ 26న రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. మరి టైం ని అయితే ఇంకా చెప్పలేదు కానీ డేట్ ని అయితే రివీల్ చేసేసారు. దీనితో అసలు సినిమాపై మరింత క్లారిటీ వస్తుంది అని చెప్పొచ్చు.మరి దీనికి కూడా ఏమన్నా ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్