Sunday, January 19, 2025
HomeTrending NewsDharuveyy Ra Song: ‘రామబాణం’ 'దరువెయ్యరా' పాట విడుదల

Dharuveyy Ra Song: ‘రామబాణం’ ‘దరువెయ్యరా’ పాట విడుదల

గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం చిత్రాలు రూపొందాయి. ఇప్పుడు వీరద్దరూ కలిసి చేస్తున్న మూడవ చిత్రం ‘రామబాణం’. ఇందులో జగపతి బాబు, ఖుష్భూ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రామబాణం’ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఈరోజు కర్నూల్‌లో జరిగిన ఈవెంట్ లో సెకండ్ సింగిల్‌ దరువెయ్యరా పాటను విడుదల చేశారు.

మిక్కీ జె మేయర్ అద్భుతమైన ఆల్బమ్‌ని స్కోర్ చేశారు. దరువెయ్యరా పాట భక్తిరసంతో పండుగ వైబ్‌ని కలిగి ఉంది. ఈ పాటను దేవాలయం బ్యాగ్ డ్రాప్ లో చిత్రీకరించారు. కుటుంబ సమేతంగా యజ్ఞం చేయడం కనిపించింది. గోపీచంద్, జగపతి బాబు, ఖుష్బూ, డింపుల్ హయాతీ, ఇలా అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. వారందరినీ కలసి చూడటమే కన్నుల పండుగలా వుంది.ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, కృష్ణ తేజస్వి, చైత్ర అంబడిపూడి ఆకట్టుకునేలా పాడారు. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.ఈ చిత్రంలో గోపీచంద్ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్