Monday, February 24, 2025
Homeసినిమా'రామబాణం' ఒక లెవెల్లో ఉంటుంది: డైరెక్టర్ శ్రీవాస్

‘రామబాణం’ ఒక లెవెల్లో ఉంటుంది: డైరెక్టర్ శ్రీవాస్

గోపీచంద్, శ్రీవాస్‌ కలయికలో వస్తున్న మూవీ ‘రామబాణం’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహా నిర్మాత. ఈ చిత్రంలో డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘ఐఫోన్’, ‘దరువెయ్యరా’ పాటలు చార్ట్ బస్టర్స్ గా అలరించాయి.

ఈ వేదికపై శ్రీవాస్ మాట్లాడుతూ .. “ఈ సినిమాలో గోపీచంద్ – జగపతిబాబు అన్నదమ్ములుగా నటించారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు కూడా వాళ్లిద్దరూ నిజమైన అన్నదమ్ములా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించాము” అని అన్నారు.

ఈ సినిమా ‘లక్ష్యం’, ‘లౌక్యం’ సినిమాలకి మించి ఉంటుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. ఏది చూసినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోపీచంద్ ఫ్యాన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. మే 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది .. అందరూ కూడా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి” అని చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్