Thursday, May 8, 2025
Homeసినిమామారేడుమిల్లిలో ‘రామారావు ఆన్ డ్యూటీ’

మారేడుమిల్లిలో ‘రామారావు ఆన్ డ్యూటీ’

Rama Rao On Duty Shooting Going On At Maredumilli Forest Area :

మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’తో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి కావొస్తుంది. ఫైనల్ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ లను తెరకెక్కించనున్నారు. ఈ షూటింగ్ పూర్తి చేసిన తరువాత విదేశాల్లో పాట‌ల చిత్రీక‌ర‌ణ జ‌రుప‌నున్నారు.

దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీల‌క‌పాత్రలో కనిపించనున్నారు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌. ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్ వేగ‌వంతం చేయ‌నున్నారు.

ఈ చిత్రంలో రవితేజ, దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు న‌టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 

రవితేజ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’

RELATED ARTICLES

Most Popular

న్యూస్