Sunday, February 23, 2025
Homeసినిమాపాటల కోసం స్పెయిన్ వెళ్ళిన రామారావు

పాటల కోసం స్పెయిన్ వెళ్ళిన రామారావు

Ramarao On Duty: మాస్ మహారాజా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ’కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP , RT టీమ్‌వర్క్స్ పై రూపొందుతోంది. ఇప్ప‌టికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. తాజాగా, రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ స్పెయిన్‌లో దిగింది. ఇప్పటికే ఆ దేశంలో పాటల చిత్రీకరణ ప్రారంభమైంది. దీంతో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

ఇటీవలే, చిత్ర నిర్మాత‌లు ఈ చిత్రం నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌ను విడుదల చేశారు. ఇది చాలా క్యూరియాసిటీని సృష్టించింది. సామ్ సిఎస్ సౌండ్‌ట్రాక్‌లను స్కోర్ చేసారు. త్వరలో సినిమా మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభిస్తారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్