Saturday, January 18, 2025
HomeTrending Newsకిషన్ రెడ్డికి బొగ్గు, గనులు - రామ్మోహన్ కు విమానయానం

కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు – రామ్మోహన్ కు విమానయానం

నిన్న ప్రమాణ స్వీకారం చేసిన కేంద్ర మంత్రిమండలి సభ్యులకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నేడు శాఖలు కేటాయించారు. ఈ సాయంత్రం ఢిల్లీ లోని తన నివాసంలో మంత్రివర్గ సహచరులతో సమావేశమైన మోడీ ప్రభుత్వ ప్రాధాన్యాలను వారికి వివరించారు. వివిధ అంశాలపై కర్తవ్య బోధ చేశారు. అనతరం శాఖలను కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ కు లేఖ పంపారు. రాష్ట్రపతి కార్యాలయం దాన్ని అధికారికంగా ప్రకటించింది.  కీలకమైన రక్షణ, హోం, ఆర్ధిక, విదేశాంగ, రోడ్డు రవాణా శాఖలను గతంలో వీటిని నిర్వహించిన సీనియర్ నేతలకే అప్పగించారు. రాజ్ నాథ్ సింగ్ (రక్షణ), అమిత్ షా (హోం); నిర్మలా సీతారామన్ (ఆర్ధిక); జై శంకర్ (విదేశాంగ); నితిన్ గడ్కరీ (రోడ్డు రవాణా) శాఖలనే తిరిగి కేటాయించారు. అశ్వని వైష్ణవ్ కు రైల్వే శాఖతో పాటు సమాచార, ప్రసార శాఖను ఇచ్చారు. హర్దీప్ సింగ్ పూరీకి పెట్రోలియం, హర్యానా మాజీ సిఎం మనోహర్ లాల్ కట్టర్ కు పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖలు… ధర్మేంద్ర ప్రదాన్ కు విద్యా శాఖను తిరిగి అప్పగించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు వైద్య శాఖతో పాటు ఎరువులు రసాయన శాఖలను, పీయూష్ గోయెల్ కు వాణిజ్యం కేటాయించారు.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కింజరాపు రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ అప్పగించారు. మోడీ 1.0 కేబినేట్ లో సైతం తెలుగుదేశం పార్టీకి ఇదే శాఖను సీనియర్ నేత పి. అశోక్ గజపతి రాజు నిర్వహించారు.

సహాయ మంత్రులుగా ఉన్న  బిజెపి ఎంపి శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ; పెమ్మసాని చంద్ర శేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్….  తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి బొగ్గు, గనులు; సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ కు హోం శాఖ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్