Saturday, September 21, 2024
Homeసినిమాప్రభాస్ 'కల్కి' గురించి ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చిన రానా

ప్రభాస్ ‘కల్కి’ గురించి ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చిన రానా

ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి’. ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తుంటే.. కమల్ హాసన్ విలన్ పాత్ర పోషిస్తుండడం విశేషం. అయితే.. ఇటీవల ఈ మూవీకి హాలీవుడ్ లో కూడా క్రేజ్ తీసుకువచ్చేందుకు టీజర్ ను అమెరికాలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కల్కి టీమ్ అమెరికా వెళ్లినప్పుడు ప్రభాస్ తో పాటు రానా కూడా అక్కడ కనిపించడం ఆసక్తిగా మారింది.

బాహుబలిలో కలిసి నటించినట్టుగా.. కల్కి మూవీలో కూడా ప్రభాస్, రానా కలిసి నటించారా..? అనే డౌట్ వచ్చింది. కల్కి మేకర్స్ నుంచి దీనికి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. అయితే.. ఇప్పుడు రానా దగ్గుబాటి కీడా కోలా అనే సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. నవంబర్ 3న కీడా కోలా మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి కూడా పాల్గొన్నారు. మీడియా ముందుకు వచ్చిన రానాకు కల్కి మూవీతో ఉన్న లింకు ఏంటి..? ఈ సినిమాలో నటించారా..? అనే ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు రానా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ఇంతకీ ఏం చెప్పారంటే… తెలుగు సినిమా ఎక్కడ బౌండరీలు దాటినా.. నా అవసరం ఉంటే అక్కడ ఖచ్చితంగా ఉంటాను అని చెప్పారు. ఇక కల్కి రిలీజ్ విషయానికి వస్తే.. సంక్రాంతికి కల్కి మూవీని రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. సంక్రాంతికి రావడం లేదు. సమ్మర్ లో కల్కి రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ పాన్ వరల్డ్ మూవీ రిలీజ్ ఎప్పుడు..? అనేది క్లారిటీ రావాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్