Sunday, January 19, 2025
Homeసినిమావైష్ణ‌వ్ తేజ్‌ ‘రంగ రంగ వైభ‌వంగా’ టైటిల్ టీజ‌ర్

వైష్ణ‌వ్ తేజ్‌ ‘రంగ రంగ వైభ‌వంగా’ టైటిల్ టీజ‌ర్

Vaibhavangaa: ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మైన మెగాస్టార్ మేన‌ల్లుడు, సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో రూపొందుతోంది. ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

న్యూ ఏజ్ లవ్ స్టోరీతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే…  ‘ఏంటే.. ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్?’  అని వైష్ణవ్ అడగ్గా.. ‘అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏమి తీసుకురానక్కర్లేదు తెలుసా..’ అని కేతిక చెబుతుంది. ‘నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా..’ అని హీరోయిన్ అంటుంటే.. తమ కనురెప్పలను తాకిస్తూ ముద్దు పెట్టుకోవడంతో ఇద్దరి ఫేస్ లను రివీల్ చేశారు.

ఎలా ఉందని కేతిక అడుగగా.. నెక్స్ట్ లెవెల్ లో ఉందని వైష్ణవ్ చెప్పడం…త‌ర్వాత‌ ”రంగ రంగ వైభవంగా” టైటిల్ టీజర్ లో కనిపించింది. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. ఉప్పెన సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్స‌స్ సాధించిన వైష్ణ‌వ్ తేజ్ ఈ రంగ రంగ వైభ‌వంగా సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.

Also Read : నాని.. ‘అంటే సుందరానికీ’ షూటింగ్ పూర్తి

RELATED ARTICLES

Most Popular

న్యూస్