శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె కొద్దిసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. విక్రమసింఘే ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు విక్రమసింఘె అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. నాటకీయ పరిణామాల వద్ద అధ్యక్షుడు గోటబాయ రాజపక్స రాజీనామా చేశారు. శ్రీలంక నుంచి మాల్దీవ్స్ అక్కడి నుంచి సింగపూర్ చేరుకున్నాక అక్కడి రాయబార కార్యాలయం ద్వారా రాజపక్స రాజీనామా లేఖ పంపారు. లంకలోనే ఉన్న మాజీ ప్రధాని మహింద రాజపక్స , మాజీ మంత్రి బాసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్లరాదని సిలోన్ సుప్రీం కోర్టు ఆదేశించింది.
మరోవైపు శ్రీలంక కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించడానికి రేపు (16వ తేదీ) పార్లమెంటులో సమావేశం కావాలని స్పీకర్ మహింద యాపా అభయవర్ధన సభ్యులకు పిలుపునిచ్చారు.
Also Read : సింగపూర్ కు గోటబాయ రాజపక్స