Sunday, January 19, 2025
Homeసినిమామళ్లీ విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక! 

మళ్లీ విజయ్ దేవరకొండ జోడీగా రష్మిక! 

విజయ్ దేవరకొండ హీరోగా ‘ఖుషీ’ సినిమా సెట్స్ పై ఉంది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ షూటింగు జరువుకుంది. ఆ తరువాత సినిమాను విజయ్ దేవరకొండ ఎవరితో చేయనున్నాడు? ఏ బ్యానర్లో ఆయన సినిమా ఉండనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పరశురామ్ – దిల్ రాజు ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయనున్నట్టుగా నిన్న ఒక ప్రకటన వచ్చింది.

ఇంతకుముందు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ చేశాడు. ఈ సినిమానే విజయ్ దేవరకొండకి మరింత స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి పరశురామ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మరో సినిమా రావాలనే అభిమానులు కోరుకుంటున్నారు. కాస్త ఆలస్యమైనా మొత్తానికి ఈ ఇద్దరూ ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారు. ఈ ముగ్గురి సిటింగుకి సంబంధించిన ఫొటో నిన్న సోషల్ మీడియాలో సందడి చేసింది.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రష్మిక మందన పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ – రష్మిక ఫ్రెండ్షిప్ గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక రీసెంటుగా దిల్ రాజు ‘వారసుడు’లోను ఆమెనే హీరోయిన్ గా చేసింది. అందువలన ఆమెను తీసుకునే అవకాశాలు ఎక్కువ అంటున్నారు. ఇక ‘సర్కారువారి పాట’లో కీర్తి సురేశ్ యాక్టింగుకి ఫిదా అయినా పరశురామ్, ఆమె పేరును ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. మరి ఫైనల్ గా ఎవరిని తీసుకుంటారనేది వేచి చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్