Sunday, January 19, 2025
Homeసినిమాజ‌న‌గ‌ణ‌మ‌న పై ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

జ‌న‌గ‌ణ‌మ‌న పై ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

Special: సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ జ‌న‌గ‌ణ‌మ‌న‌. ఇది పూరి జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్. దీంతో ఈ పాన్ ఇండియా మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇటీవ‌ల ఈ మూవీ సెట్ లో పూజా జాయిన్ అయ్యింది. త్వ‌ర‌లో విజ‌య్, పూజాల పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీ నుంచి ఓ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే… ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట‌. ఈ సాంగ్ ను క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నా చేయబోతోందని స‌మాచారం. విజ‌య్, ర‌ష్మిక క‌లిసి గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ చిత్రాల్లో న‌టించారు. వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. అందుక‌నే విజ‌య్ మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేయ‌డానికి ర‌ష్మిక ఓకే చెప్పింద‌ట‌.

ఈ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే.. ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా నిజంగానే ర‌ష్మిక జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రంలో స్పెష‌ల్ సాంగ్ చేస్తుందా..?  లేదా..? అనేది తెలియాల్సివుంది. పూరి డైరెక్ష‌న్ లో విజ‌య్ న‌టించిన లైగ‌ర్ ఈ ఆగ‌ష్టు 25న విడుద‌ల అవుతుంటే.. జ‌న‌గ‌ణ‌మ‌న వ‌చ్చే సంవ‌త్స‌రం ఆగ‌ష్టు 3న విడుద‌ల కానుంది. మ‌రి.. ఈ రెండు చిత్రాల‌తో విజ‌య్, పూరి క‌లిసి బాక్సాఫీస్ ని రికార్డుల‌తో షేక్ చేస్తారేమో చూడాలి.

Also Read : విజ‌య్, పూరిలకు కూడా జాన్వీ నో చెప్పిందా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్