Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్ జోడీగా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్టే! 

ఎన్టీఆర్ జోడీగా రష్మిక ఛాన్స్ కొట్టేసినట్టే! 

రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇంతవరకూ ఆమె టాలీవుడ్ లో పూజ హెగ్డే .. కీర్తి సురేశ్ తో పోటీపడుతూ వచ్చింది. అయితే అనుకోకుండా ఈ ఇద్దరు హీరోయిన్స్ కి ఇక్కడ ప్రాజెక్టుల విషయంలో గ్యాప్ వచ్చేసింది. త్వరలో వాళ్ల నుంచి వచ్చే సినిమాలేవీ కనిపించడం లేదు. ఒక్క రష్మిక చేసిన ‘పుష్ప 2’ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, రష్మిక కెరియర్ కి మరింత హెల్ప్ కానుంది.

‘పుష్ప’ సినిమాతోనే రష్మిక భారీ ప్రాజెక్టులను తన చేతుల్లోకి తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండటానికి కారణం కూడా ఆ సినిమానే. అలాంటి సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘పుష్ప 2’ కోసమే ఆమె కూడా వెయిట్ చేస్తోంది. ఇక ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఆమె పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ వార్తనే ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.

ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్, ఆ తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా రష్మికను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అదే నిజమైతే ఎన్టీఆర్ తో రష్మిక చేసే ఫస్టు మూవీ ఇదే అవుతుంది. అలాగే ఆమె చేస్తున్న పాన్ ఇండియా సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోతుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్