Saturday, January 18, 2025
Homeసినిమాఅందాలరాశి ఆశ నెరవేరేనా?

అందాలరాశి ఆశ నెరవేరేనా?

Luck ‘Pakka’?: తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రాశి ఖన్నా ఒకరు. తెరపై గులాబీ గుత్తిలా కనిపించే రాశి ఖన్నాకి  పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ .. ‘బెంగాల్ టైగర్’ .. ‘సుప్రీమ్’ .. ‘తొలిప్రేమ’ వంటి సూపర్ హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. రాశి ఖన్నా అందంగా  కనిపించడమే కాదు .. అవసరమైనంత వరకు నటించగలదు. ‘సుప్రీమ్’ సినిమాతో తాను కామెడీ కూడా చేయగలనని నిరూపించిన రాశి ఖన్నా, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతోను మెప్పించింది. అయితే ఆ తరువాత ఆమెకి పెద్దగా హిట్స్ పడలేదు.

మొదటి నుంచి కూడా అవకాశాల విషయంలో రాశి ఖన్నా దూకుడుగా వెళ్లింది ఎప్పుడూ లేదు. నిదానమే ప్రధానమనే ఆమె తీరే ఇప్పటివరకూ ఉండేలా చేసిందనే వారు లేకపోలేదు. ఎందుకంటే  దూకుడుగా వెళ్లిన రెజీనా .. రకుల్ ఇద్దరికీ కూడా ప్రస్తుతం అవకాశాలు లేవు. వాళ్లిద్దరూ రానున్న సినిమాల్లోగానీ ..  రాబోయే ప్రాజెక్టులలోగాని కనిపించడం లేదు. రాశి ఖన్నా  మాత్రం తనదైన పద్ధతిలోనే ఒక్కో అవకాశాన్ని అందుకుంటూ వెళుతోంది. అలా ఆమె తాజాగా చేసిన సినిమానే ‘పక్కా కమర్షియల్’.

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, జులై 1వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమాలో సీరియల్ ఆర్టిస్ట్ గా రాశి ఖన్నా కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఇటు గోపీచంద్ .. అటు మారుతి చెప్పడం ఆసక్తికరంగా మారింది. కొంతకాలంగా సరైన హిట్స్ లేని రాశి ఖన్నా ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకుంది. ఇక గోపీచంద్ – మారుతికి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా కీలకమైనదే. మరి ఈ సినిమా వాళ్ల ఆశని ఎంతవరకూ నెరవేరుస్తుందనేది చూడాలి.

Also Read : ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ లో దేవకన్యలా రాశీ ఖన్నా 

RELATED ARTICLES

Most Popular

న్యూస్